ఈ బైక్‌ను మడతపెట్టొచ్చు..!
అవును.. మీరు చదివిందే కరెక్టే. కాస్త విచిత్రంగా అన్పించినా బైక్‌ను ఎంచక్కా మడతేసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవచ్చు. ఇలాంటి సౌకర్యం ఉన్న ఓ ఫోల్డబుల్ బైక్‌ను తయారు చేశారు రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి సమీపంలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు జగదీశ్, జాన్రిచర్డ్, కార్తీక్, సాయికిరణ్, అతీఫ్ అలీ. వీరు తయారు చేసిన ‘చెవ్రాన్ ఫోల్డబుల్ బైక్’ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ బైక్ మామూలు బైకుల్లా పెట్రోల్‌తో నడుస్తుంది. అగ్రికల్చర్ వీడర్ ఇంజిన్‌ను దీనికి అమర్చారు. హారన్, డిస్క్‌బ్రేక్, యాక్సిలేటర్, గేర్లు, సెల్ప్ స్టార్టర్, లైట్లు అన్ని ఉన్నాయి దీనికి.
దీని సామర్థ్యం 53సీసీ. బరువు 15కిలోలు. లీటరు పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజ్. గంటకు 40 కిలోమీటర్ల వేగం. 110 కిలోల భారాన్ని సైతం మోస్తుందట. కానీ దీని తయారీ ఖర్చు ఎంతో తెలుసా.. కేవలం రూ.12వేలే. దీన్ని బీడీఎల్ అడిషనల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సీఎస్ కృష్ణప్రసాదరావు చూసి ‘బెస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ ’గా కితాబిచ్చారని విద్యార్థులు తెలిపారు. కొన్ని మోడిఫికేషన్స్ తర్వాత దీన్ని మార్కెట్లోకి తెస్తామంటున్నారీ విద్యార్థులు. వీరు తమ గైడ్స్ విజయ్‌కుమార్, యూజిన్ హ్యారీ సహా యంతో ఈ అద్భుతమైన బైక్‌ను రూపొందించారు.
- న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం