Foreign and Commonwealth Office
-
పాక్ ప్రయాణాలు మానుకోండి: యూకే
లండన్: బ్రిటన్ గురువారం తమ పౌరులకు కీలక సూచనలు జరీ చేసింది. పాకిస్తాన్లో పర్యటించడం మానుకోమని ఫారెన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్(ఎప్‌సీవో), బ్రిటన్ సిటిజన్స్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లేవారు.. ఎక్కువ ప్రాంతాలను సందర్శించకపోవడం మంచిదని పేర్కొంది. ముఖ్యంగా ఎల్వోసీ సమీప ప్రాంతాల్లో పర్యటించకూడదని తెలిపింది. పాకిస్తాన్లో రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు దూరంగా ఉండాలని సూచించింది. బెలూచిస్తాన్, సింధూ గ్రామీణ, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలతోపాటు ట్రైబల్ ఏరియాల్లో పర్యటన రద్దు చేసుకోమని సలహానిచ్చింది. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండటంతోపాటు.. ప్రమాదం జరిగే ప్రాంతాల్లో పర్యటించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కొన్ని ఫ్లైట్ రూట్లలో, విమానాశ్రయాలలో ఆంక్షలు ఉన్నందునా.. తాజా సమచారం కోసం సందర్శకులు తమ ఎయిర్‌లైన్స్‌ను సంప్రందించాలని తెలిపింది. -
పర్యాటకులకు అత్యంత ప్రమాదకర దేశాలివే!
లండన్: రెండేళ్ల క్రితం ట్యునీషియాలోని సౌసీలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కాల్పులు జరపడంతో 38 మంది మృతి చెదిన విషయం తెలిసిందే. విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిపిన క్రూరమైన దాడుల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ ఘటన అనంతరం.. పర్యాటకులకు ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించే చర్యలు పెరిగాయి. పర్యాటకులపై దాడులు, కిడ్నాప్‌లు, స్థానికంగా ఉన్న అశాంతి, విపత్తులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్సీఓ(ద ఫారెన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్) క్రమం తప్పకుండా పర్యాటకులకు ప్రమాదకరమైన దేశాల జాబితాను విడుదల చేస్తోంది. ఇటీవలి ఈ జాబితాలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, దక్షిణ సూడాన్, సిరియా, ఎమెన్ దేశాల్లోని అన్నిప్రాంతాల్లో పర్యాటకులకు తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయని ఎఫ్సీఓ వెల్లడించింది. మరో 32 దేశాల్లోని కొన్ని ప్రాంతాలు పర్యాటకులకు హానికరమని తెలుపుతూ విడుదల చేసిన జాబితాలో.. ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఈజిప్ట్, జార్జియా, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్, మాలి, ఫిలిప్పీన్స్ తదితర దేశాలున్నాయి.