కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక
యాడికి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు క్రియాశీలక నాయకులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, తాడిపత్రి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి ఆదివారం మండలంలోని ఓబుళాపురం గ్రామాన్ని సందర్భించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అనంతరం శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి వీఆర్వో పుల్లారెడ్డి తదితరులతో మాట్లాడారు.
అనంతరం గడపగడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆదిరెడ్డి తమ్ముడు లక్ష్మిరెడ్డి, విష్ణునారాయం రెడ్డి, దామోదర్ రెడ్డిలకు వైఎస్సార్సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వారి వెంట బోగాలకట్ట వెంకటరామిరెడ్డి, కొట్టే వెంకటరామిరెడ్డి, యాపర్ల రామచంద్రారెడ్డి, కొండారెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ గుర్రాల రామచంద్రుడు తదితరులు ఉన్నారు.