కౌలురైతు బలవన్మరణం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అప్పుల బాధ తాళలేక ఒక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మండలంలోని నాగారం పంచాయతీ రేపల్లెవాడకు చెందిన అన్నంగి కృష్ణ(44) అనే కౌలురైతు మూడున్నర ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. పంటకు చీడ సోకడంతో అంతా పాడైంది. తీసుకున్న అప్పు తీర్చే మార్గంలేక మనస్తాపం చెందిన కౌలురైతు ఆదివారం ఉదయం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రమణ, ముగ్గురు కుమారులు ఉన్నారు.