నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఎంపీ మిథున్‌రెడ్డి పరామర్శ
- పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
- మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో సమీక్ష
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేత, గాలివీడు మండలానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవుల నాగభూషణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పరామర్శించారు. పట్టణంలో ఎస్ఎన్ కాలనీలోని నాగభూషణ్‌రెడ్డి నివాసానికి వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న నాగభూషణ్‌రెడ్డి కుమారుడితో మాట్లాడారు. అలాగే ఇదే దాడిలో గాయపడిన నాగభూషణ్‌రెడ్డి సోదరుడు పుల్లారెడ్డి, ఆయన కుమారుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఇలాంటి దాడుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజూర్ రెహమాన్, బియంకె రషీద్‌ఖాన్, చిల్లీస్ ఫయాజ్, వైఎస్సార్సీపీ నాయకులు కొలిమి చాన్‌బాషా, యస్పియస్ రిజ్వాన్, ముల్లా హజరత్, కొట్టె చలపతి, జాకీర్, గంగిరెడ్డి, మిట్టపల్లె యదుభూషణ్‌రెడ్డి, గుమ్మా అమర్నాథరెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో చర్చ
మున్సిపల్ ఛైర్పర్సన్ నసిబున్ఖానంతో పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ మిథున్‌రెడ్డి చర్చించారు. శనివారం ఆయన ఛైర్పర్సన్ ఇంటికి వెళ్లి విందులో పాల్గొన్నారు. అనంతరం ఛైర్పర్సన్ భర్త సలావుద్దీన్, పలువురు కౌన్సిలర్లతో ఆయన పట్టణంలోని పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.