కలెక్టర్, జేసీలకు ఫార్చ్యూనర్ కార్లు
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల కోసం కొత్త కార్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పది మంది జిల్లా కలెక్టర్లు, 11 మంది జాయింట్ కలెక్టర్ల (రంగారెడ్డిలో ఇద్దరు జేసీలు) కోసం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల విలువైన ఫార్చూ ్యనర్ కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ. 5.25కోట్లు మం జూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన క మిషనర్ను ఆదేశించింది.