foundation works
-
29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు
తిరుపతి: తిరుపతి-విశాఖపట్టణం మధ్య కొత్తగా ఏర్పాటుచేయనున్న డబుల్ డెక్కర్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈనెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి 29వ తేదీ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించడంతో పాటు తిరుప్తిలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక లాండ్రీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తిరుపతి రైల్వే దక్షిణం వైపున ఉన్న టీటీడీ స్థలాల్లో అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం, కనెక్టివిటీ రోడ్డు పనులకు కూడా కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
శంకుస్థాపన భద్రత ఏర్పాట్లపై సీఎం సమీక్ష
విజయవాడ : ఏపీ రాజధాని శంకుస్థాపన పనుల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ ప్రధానితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లుపై చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా శంకుస్ధాపన కార్యక్రమం సజావుగా చేయడానికి అన్ని శాఖల వారు సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు అధికారులను కోరారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణతోపాటు పలు కీలక అంశాలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.