ముంబైలో ఓ భవంతిలో అగ్నిప్రమాదం, నలుగురి మృతి
ముంబైలో సోమవారం వేకువజామున ఓ భవంతిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ గాడ నిద్రలో ఉండటంతో తప్పించుకోలేకపోయారు.
సిద్దార్థ్నగర్ కైలాస్ అపార్ట్మెంట్లో తెల్లవారుజాము 3:15 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గౌతమ్ (55), అతని భార్య పూర్ణిమ (50), కొడుకు విశాల్ (32), మనువడు ఆయుష్ (10) మంటల్లో కాలిపోయారు. గాయపడిన మరో నలుగురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్ప్రత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.