హాస్టల్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం!
ఓ నాలుగు అంతస్తుల హాస్టల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హాస్టల్లో మొత్తం 92 మంది ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే భయంతో వీరంతా బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు 52 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
(SENSITIVE) At least 6 people have died, and 20 others are injured in Wellington, NZ, after a fire broke out in a hostel. #nz #newzealand #wellington #hostel #fire #fires #hostelfire #loaferslodge #hostels #nzpol #chrishipkins #torywhanau pic.twitter.com/j9TxuhyKcs
— Empact News (@EmpactNews) May 16, 2023
కాగా.. అగ్నిప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సంఖ్య 10 దాటి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక కచ్చితమైన వివరాలు తెలుస్తాయన్నారు.
మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హాస్టల్లో స్ప్రింక్లర్స్ లేవని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన ఇదే అని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్..