France government
-
మోడల్ స్కూళ్లకు ఫ్రాన్స్ చేయూత
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ తీర్చిదిద్దిన మోడల్ కార్పొరేషన్ స్కూళ్లను చూసి అచ్చెరువొందిన ఫ్రాన్స్ ప్రభుత్వం.. మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 44 కార్పొరేషన్ స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేట్ అండ్ సస్టైన్ (సిటీస్) పేరుతో ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) రూ.52 కోట్ల నిధులు సమకూర్చింది. ఈ నిధులతో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలపై సిటీస్ బృందం ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జీవీఎంసీ అధికారులతో సమావేశమైంది. వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు విభిన్న ప్రాజెక్టులతో ముందుకెళ్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. సిటీస్ చాలెంజ్ పేరుతో ఏడాది కిందట జరిగిన పోటీలో 15 నగరాలకు సంబంధించి మొత్తం 26 ప్రాజెక్ట్‌లు ఎంపికవ్వగా.. ఇందులో కార్పొరేషన్ పాఠశాలలను ఆధునికీకరించిన జీవీఎంసీ ప్రాజెక్ట్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఆకర్షించింది. దీనికి ఫిదా అయిన ఫ్రాన్స్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏఎఫ్‌డీ) మరిన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. -
ముస్లిం మహిళకు పౌరసత్వ నిరాకరణ
పారిస్, ఫ్రాన్స్ : పౌరసత్వ వేడుకలో అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు పౌరసత్వం కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రెంచ్ సమాజంతో మమేకం అవడానికి ఆమె సుముఖంగా లేదనడానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొంది. ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా ఆమె ఫ్రెంచ్ పౌరసత్వ నియమావళిని ఉల్లంఘించిందని తెలిపింది. ఫ్రాన్స్ జాతీయులుగా కావాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మత విశ్వాసాలకు అనుగుణంగానే.. అల్జీరియాకు చెందిన ముస్లిం మహిళ 2010లో ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పౌరసత్వం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తూనే ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం తనకు నిరాశ కలిగించిందని తెలిపింది. తాను మతాచారాలను గౌరవిస్తానని, అందుకే అధికారులతో చేతులు కలపడానికి నిరాకరించినట్లు పేర్కొంది. -
కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ షెవలీర్ అవార్డు
చెన్నై: ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్‌ను ఫ్రాన్స్ ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మక షెవలీర్ అవార్డుతో గౌరవించనుంది. కమల్‌ను ‘నైట్ ఇన్ ది నేషనల్ ఆర్డర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డుతో సత్కరిస్తామని ఫ్రాన్స్ కళలు, సమాచార శాఖ ప్రతినిధి ఆదివారమిక్కడ ప్రకటించారు. త్వరలో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఇస్తారు. గతంలో శివాజీ గణేషన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ ఈ అవార్డును అందుకున్నారు. -
రష్యా అభిమానులకు జైలు
యూరో కప్‌లో అల్లర్లు సృష్టించిన రష్యా అభిమానులపై ఫ్రాన్స్ ప్రభుత్వం కఠినచర్యలకు దిగింది. ఇందులో భాగంగా గత మంగళవారం 43 మంది అభిమానులను పోలీసులు అరెస్ట్ చేయగా ముగ్గురికి ఫ్రెంచ్ కోర్టు జైలుశిక్షను విధించింది. ఓ వ్యక్తిని ఇనుపరాడ్‌తో బాదిన యెరునోవ్ అనే అభిమానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించగా మరో ఇద్దరికి ఏడాదిన్నర, ఏడాది పాటు శిక్ష వేసింది. అయితే తమ దేశస్థుల అరెస్ట్‌ను రష్యా ప్రభుత్వం ఖండించింది. ఈవిషయంలో ఫ్రాన్స్ రాయబారికి సమన్లు పంపింది. అలాగే 20 మంది రష్యా అభిమానులను పోలీసులు ఫ్రాన్స్ నుంచి బహిష్కరించారు.