free surgeries
-
100 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు
సాక్షి, అమరావతి: పునర్జీవితాన్ని ప్రసాదిస్తాం అనే పేరుతో 100 మంది చిన్నారులకు వివిధ రకాలైన ఉచిత శస్త్ర చికిత్సలు చేసే కార్యక్రమాన్ని ఆస్టర్ ఆస్పత్రి యాజమాన్యం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం ప్రారంభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఏపీ, తెలంగాణ ఆస్టర్ ఆస్పత్రుల రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె.టి.దేవానంద్ లాంఛనంగా ప్రారంభించారు. 12 సంవత్సరాల్లోపు వయసు కలిగిన 100 మంది నిరుపేద చిన్నారులకు ఏడాది కాలం ఉచితంగా చికిత్స నిర్వహించనున్నట్టు తెలిపారు. అపెండిసైటిస్, పీడియాట్రిక్, యూరాలజీ శస్త్ర చికిత్సలతో పాటు, కాలేయ మార్పిడి, గుండె సంబంధిత, వివిధ రకాల చికిత్సలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
నేత్రదానం మహాదానం
కొరుక్కుపేట: నేత్రదానం మహాదానమని ప్రముఖ సినీనటుడు సంతానం పేర్కొన్నారు. ఈ మేరకు కంటి వైద్య చికిత్సలో ఆధునిక టెక్నాలజీని జోడించి నేత్ర వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రి చెన్నై శివారు ప్రాంతం అంబత్తూర్లో డాక్టర్ అగర్వాల్ ఐ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు సంతానం పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పటల్స్ సీఈఓ డాక్టర్ ఆదిల్ అగర్వాల్ మాట్లాడుతూ అంబత్తూర్లో తమ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు . ప్రారంభోత్సవ సందర్భంగా అర్హులైన పేదలు 100మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తామని ప్రకటిస్తూ పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబత్తూర్ ప్రజలకు తమ సేవలను చేరువ చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రి అంబూత్తూర్ క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ కౌశిక్ పిబి మాట్లాడుతూ అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలతో ఐ కేర్ సేవలు అందులో కార్నియా , క్యాటరాక్ట్, గ్లకోమా, పెడియాట్రిక్ ఐ కేర్ ట్రీట్మెంట్లు ఇంకా న్యూరో ఆప్తమాలజీ, రెటినా, లో విజన్ రెహాబిలిటేషన్ సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం నటుడు సంతానం మాట్లాడూతూ ప్రముఖ కంటి ఆస్పత్రిగా రాణిస్తున్న డాక్టర్ అగర్వాల్ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయమన్నారు. అన్ని దానాల్లోకంటే నేత్రదానం మహాదానం అని పేర్కొన్నారు . నేత్రదానం చేసేందుకు యువత ముందకు రావాలని పిలుపునిచ్చారు. -
యాసిడ్ బాధితులకు ఉచిత సర్జరీలు
ముంబై: యాసిడ్ బాధితులకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్టు యాసిడ్ సర్వైవర్స్ ఫౌండేషన్ ప్రకటించింది. 'ప్రాజెక్ట్ రివైవ్' పథకం కింద మార్చి 1నుంచి 12 వ తేదీవరకు ఢిల్లీలో ఉచితంగా ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఇందులో నాగాలాండ్, మిజోరం, కాశ్మీర్ వంటి రిమోట్ మరియు సుదూర ప్రాంతం సహా దేశంలోని బాధితులకు ఈ చికిత్స అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం దేశ విదేశాలకు చెందిన ప్లాస్టిక్ సర్జన్లు, సంబంధిత నిపుణులు పనిచేస్తున్నారని ఎఎఫ్ఎస్ఐ మేనేజర్ మేఘ మిశ్రా తెలిపారు. దీనికి వాట్సాప్, ఇమెయిల్ ద్వారా బాధితులు ఫోటోలను పంపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా ఈ సర్జరీల ప్రీ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. బాధితులను పూర్తిగా పరిశీలించిన మీదట ఎలాంటి చికిత్స అందించేది నిర్ణయిస్తామని తెలిపారు. దీంతోపాటుగా, ప్రీ అండ్ పోస్ట్ ఆపరేషన్ కేర్తోపాటు, దీర్ఘకాలం చికిత్స అవసరమైన వారికి వసతి సౌకర్యాలను 100 శాతం ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నెల 29 లోగా బాధితుల తమ వివరాలను 9711668882 అనే నెంబరుకు వాట్సాప్ ద్వారా గానీ, మిశ్రా డాట్ మేఘ09@ జీమెయిల్.కామ్ పంపించాలని కోరారు. యాసిడి బాధితుల సహాయార్ధం తాము చేపట్టిన ప్రచారానికి అమెరికా , కెన్యా, అస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని మిశ్రా చెప్పారు. కేవలం వైద్య సహాయం మాత్రమేకాకుండా.. బాధితులకు అవగాహనా కార్యక్రమాలను కూడా తమ సంస్థ చేపడుతుందని ఆమె తెలిపారు.