Free water
-
అందులో ఏం తప్పుంది!... కేంద్రం పై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని పార్టీలు ఉచిత రెవిడిలు(ఉచిత పథకాలను) అందిస్తున్నారంటూ నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉచితాలను ప్రజలకు ఎరగా వేసి అధికారంలోకి రాకూడదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు సంబంధించి సుమారు రూ. 10 లక్షల కోట్ల రుణాలను సాక్షాత్తు కేంద్రమే మాఫీ చేసిందంటూ ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొన్నవారిని సైతం కటకటాల వెనక్కి పంపాలంటూ మండిపడ్డారు. మంత్రులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినప్పుడూ మరీ సామాన్యులకు ఎందుకు ఉచిత పథకాలు ఉండకూడదంటూ ప్రశ్నించారు. సామాన్యులకు ఉచిత విద్య, ఉచిత నీరు కల్పించడంలో తప్పు ఏముందన్నారు. బడా కార్పోరేట్లకు పెద్ద మొత్తాల్లో ఉచితంగా రుణ మాఫీ చేయడంలో లేని తప్పు ఇందులో ఎందుకు ఉంది అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. (చదవండి: హఠాత్తుగా పెరిగిన నది ఉధృతి... ఏకంగా 14 కార్టు గల్లంతు) -
డిల్లీ తరహ హైదరాబాద్లో ఉచ్చిత నీరు సాద్యమే!
-
కేజ్రివాల్ కు అస్వస్థత, ఇంటి నుంచే విధుల నిర్వహణ!
ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అరవింద్ కేజ్రివాల్ అస్వస్థతకు గురయ్యారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రివాల్ తొలి రోజు తన నివాసం నుంచే విధులను నిర్వహించారు. ప్రతి ఇంటికి 666 లీటర్ల మంచినీరును ఉచితంగా అందించనున్నట్టు తొలి ప్రకటన చేశారు. విరోచనాలతో, 102 డిగ్రీల జ్వరంతో కేజ్రివాల్ బాధపడుతున్నాను. తొలి రోజు ఆఫీస్ కు చేరుకోలేకపోతున్నాను అని కేజ్రివాల్ ట్విటర్ లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. కేజ్రివాల్ డయేరియాతో బాధపడుతున్నాడని ఆయన వ్యక్తిగత వైద్యుడు విపిన్ మిట్లల్ మీడియాకు వెల్లడించారు. కేజ్రివాల్ అస్వస్థతకు గురయ్యారు పార్టీ నేత కుమార్ విశ్వాస్ తెలిపారు. వివిధ రకాల డిమాండ్లతో కేజ్రివాల్ నివాసానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మధ్యాహ్నం జల్ బోర్డు అధికారులతో సమావేశమై ఉచితంగా నీరును అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి 700 లీటర్ల మంచినీరును ఉచితంగా అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.