కేజ్రివాల్ కు అస్వస్థత, ఇంటి నుంచే విధుల నిర్వహణ!
ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అరవింద్ కేజ్రివాల్ అస్వస్థతకు గురయ్యారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రివాల్ తొలి రోజు తన నివాసం నుంచే విధులను నిర్వహించారు. ప్రతి ఇంటికి 666 లీటర్ల మంచినీరును ఉచితంగా అందించనున్నట్టు తొలి ప్రకటన చేశారు. విరోచనాలతో, 102 డిగ్రీల జ్వరంతో కేజ్రివాల్ బాధపడుతున్నాను. తొలి రోజు ఆఫీస్ కు చేరుకోలేకపోతున్నాను అని కేజ్రివాల్ ట్విటర్ లో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
కేజ్రివాల్ డయేరియాతో బాధపడుతున్నాడని ఆయన వ్యక్తిగత వైద్యుడు విపిన్ మిట్లల్ మీడియాకు వెల్లడించారు. కేజ్రివాల్ అస్వస్థతకు గురయ్యారు పార్టీ నేత కుమార్ విశ్వాస్ తెలిపారు. వివిధ రకాల డిమాండ్లతో కేజ్రివాల్ నివాసానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మధ్యాహ్నం జల్ బోర్డు అధికారులతో సమావేశమై ఉచితంగా నీరును అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి ఇంటికి 700 లీటర్ల మంచినీరును ఉచితంగా అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.