పారిస్ స్టోర్ బందీలకు విముక్తి
పారిస్: పారిస్ సమీపంలో సాయుధులు దాడి చేసిన షాపింగ్ మాల్లో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. సాయుధులు స్టోర్‌లో దోపిడీ చేసి పారిపోయాక.. వారి చెరలో కొన్ని గంటల పాటు బందీలుగా ఉన్న మొత్తం 18 మంది క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో సాయుధులు మాల్‌లోకి చొరబడి అక్కడ ఉన్నవారిని బందించారు. షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు మేసేజ్ చేసినట్టు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. పోలీసులు వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని వాహానాల రాకపోకలను నిషేధించి, ఇతర షాపులను మూసివేయించారు. భద్రత దళాలు బందీలను రక్షించే ప్రయత్నం చేస్తుండగానే, సాయుధాలు దోపిడీ చేసి పారిపోయారు. ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు వచ్చినట్టు భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.