ఆంధ్రా పార్టీలను ప్రజలు నిలదీయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, చివ్వెంల : ఓట్ల కోసం వస్తున్న ఆంధ్రా పార్టీలను ప్రజలు నిలదీయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని బీబిగూడెంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2014లో ఓట్లు అడిగేటప్పుడు ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా నెరవేర్చానన్నారు. మీరు వేసిన ఓటే పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు వేసిందన్నారు. గత పాలనలో సంవత్సరానికి ఒక గంట విద్యుత్ సరఫరా తగ్గుకుంటూ వస్తే టీఆర్ఎస్ పాలనలో మూడు సంవత్సరాల్లో 24గంటల విద్యుత్ అమలైందన్నారు. 500 జనాభాలు ఉన్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపుతో పాటు రైతు రుణమాఫీ లక్ష, రైతు బంధు 8 నుంచి 10వేలు, సొంత స్థలంలో కట్టుకునేందుకు డబుల్బెడ్రూం ఇళ్లు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక్‌బాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, పెద్దగట్టు చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, చందుపట్ల పద్మయ్య , భూక్య ఎబిఎక్స్ వెంకటేశ్వర్లు, చిమ క్రిష్ణ, అల్లిరాజు, ధరావత్ కిషన్ గుగులోతు నాగు, భిక్షనాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి..
పెన్‌పహాడ్ : టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ధర్మాపురం, భక్తాళాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా అడ్డుకునే మహాకూటమికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. అనంతరం ధర్మాపురం గ్రామానికి చెందిన నెమ్మాది దుర్గమ్మతో మాట్లాడుతూ పెన్షన్ వస్తుందని అడిగగా ఆమె వస్తుందని చెప్పింది.. ఎవరు ఇస్తున్నారంటే కేసీఆర్ ఇస్తున్నాడని.. ఓటు ఎవరికి వేస్తావని అడగగా కారు గుర్తుకు వేస్తానని సమాధానం చెప్పింది. కార్యక్రమంలో ఒంటెద్దు నర్సింహారెడ్డి, వూర రాంమ్మూర్తి, నెమ్మాది భిక్షం, భూక్య పద్మ, మిర్యాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, వావిళ్ల రమేష్‌గౌడ్, కర్ణాకర్‌రెడ్డి, మండాది నగేష్‌గౌడ్, యాట ఉపేందర్, వెన్న సీతారాంరెడ్డి, నెమ్మాది నగేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తాలు...