బదిలీ అయిన టీచర్లు త్వరలో రిలీవ్ | Transferred Teachers relieve soon in telangana | Sakshi
Sakshi News home page

బదిలీ అయిన టీచర్లు త్వరలో రిలీవ్

Published Sat, Jul 5 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

Transferred Teachers relieve soon in telangana

సాక్షి, హైదరాబాద్: బదిలీ అయినా పాత స్థానాల్లోనే పనిచేస్తున్న టీచర్లను రిలీవ్ చేసే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రి జగదీష్‌రెడ్డి శుక్రవారం తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే టీచర్లు అవసరానికి మించి ఉన్నారని, అంతా సర్దుబాటు అయ్యాక డీఎస్సీ గురించి ఆలోచిస్తామన్నారు.

తెలంగాణలోని వివిధ వర్సిటీలకు వీసీలనునియమించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చే స్తామని చెప్పారు. కాగా థాయ్‌లాండ్ ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యాసంస్థకు చెందిన బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డితో భేటీ అయింది. ఐదేళ్ల సమీకృత మాస్టర్ డిగ్రీ కోర్సుపై జేఎన్‌టీయూహెచ్‌తో ఈ విద్యాసంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement