ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ వాటా విక్రయం
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాల విక్రయం పూర్తయినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. టర్కీలోని ఇంస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని 40 శాతం వాటాను రూ.1,740 కోట్లకు విక్రయించామని, దీనికి సంబంధించిన మొత్తం అందుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు జీఎంఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వాటాను మరో భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ)కి విక్రయించింది. దీంతో జీఎంఆర్‌కి రూ. 1,740 కోట్ల మూలధనం చేతికి రావడమే కాకుండా, రూ.1,412 కోట్ల రుణ భారం తగ్గనుంది. ఈ ఒప్పందం పూర్తి కావడంపై జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎంఆర్ రావు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విదేశీ ఆస్తుల విక్రయించడంలో మా సమర్థతో మరోసారి రుజువయ్యిందన్నారు.