23 వరకు పలు రైళ్లు రద్దు
-ఖుర్దారోడ్ డివిజన్లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు
తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖుర్దారోడ్ డివిజన్లోని చుడాంగాగఢ్, బారంగ్, భువనేశ్వర్ న్యూ, మాంచేశ్వర్ స్టేషన్ల వద్ద నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ పేర్కన్నారు. ఈ నాన్-ఇంటర్ లాకింగ్ పనులు దృష్ట్యా ఈ నెల 17 నుండి 23 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నామని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
రద్దయిన రైళ్ల వివరాలు
రైలు నెం. 22874 – విశాఖ - డిఘా వీక్లీ ఎక్స్‌ప్రెస్ (విశాఖ నుండి 15, 22వ తేదీల్లో)
రైలు నెం. 22873 – డిఘా - విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (డిఘా నుండి 16, 23వ తేదీల్లో)
రైలు నెం. 22810 – విశాఖ - పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (విశాఖలో 18న రద్దు)
రైలు నెం. 22809 – పారాదీప్–విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (పారాదీప్‌లో 21న రద్దు)
రైలు నెం. 58528 –విశాఖ – రాయపూర్ పాసింజర్ రైలు (విశాఖలో 15 నుండి 22 వరకు)
రైలు నెం. 58527 రాయ్‌పూర్ – విశాఖ పాసింజర్ రైలు (రాయ్‌పూర్‌లో 16 నుండి 23 వరకు)
రైలు నెం.58538– విశాఖ – కోరాపుట్ పాసింజర్ (విశాఖలో 15 నుండి 22వరకు)
రైలు నెం. 58537 కోరాపుట్–విశాఖ పాసింజర్ రైలు (కోరాపుట్‌లో 16 నుండి 23 వరకు)