143... చాలా కాస్ట్లీ!
‘‘ఈ చిత్రంలోని ఏడు పాటలూ చాలా బాగా వచ్చాయి. గబ్బర్‌సింగ్ గ్యాంగ్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని దర్శకుడు వి.ఎస్ వాసు చెప్పారు. శ్రీహరి, ఉదయగిరి, హేమంతిని, ఇషికా సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టోల్ ఫ్రీ నెంబర్ 143’. ‘ఇది చాలా కాస్ట్ గురూ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా పాటల విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దాసరి భాస్కర్ యాదవ్ నిర్మాత. శ్రీ వెంకట్ స్వరాలం దించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘దర్శకుడు చెప్పిన దాని కన్నా చాలా బాగా తీశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.