‘నేరెళ్ల’ కేసును సీబీఐకి అప్పగించండి
హైకోర్టులో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామ దళితులపై పోలీసుల దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలైంది. బాధితులను నిమ్స్‌కు తరలించి వారికి సరైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరి హారం అందించేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ వ్యాజ్యంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డైరెక్టర్, జిల్లా ఎస్పీ, జైలు సూపరింటెండెంట్‌తోపాటు ఎస్పీ విశ్వజిత్, సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.