శాంసంగ్ గెలాక్సీ జె 5, జె 7లాంచింగ్ నేడే
న్యూఢిల్లీ: ఇండియన్ మొబైల్ మార్కెట్ లో దూసుకుపోతున్న శాంసంగ్ జె సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్లను సోమవారం భారత మార్కెట్ లో రిలీజ్ చేయనుంది. స్మార్ట్ పోన్ సెగ్మెంట్ లో శాంసంగ్ 'గెలాక్సీ జె7' ., గెలాక్జీ జె 5' లను ఈ రోజు విడుదల చేయనుంది. మొబైల్ అమ్మకాల్లో యాపిల్ సంస్థకు ఇప్పటికే చెక్ పెట్టిన శాంసంగ్, గెట్ రెడీ టూ విట్నెస్ ద నెక్ట్స్ అంటూ ప్రత్యర్థి కంపెనీలకు సవాలు విసురుతోంది. తన తాజా గెలాక్సీ J5ను సుమారు Rs. 17,000, గెలాక్సీ J7ను సుమారు 21,000 రూపాయలకు వినియోగదారులకు లభ్యం కానుంది. మెటల్ ఫ్రేమ్స్ తో వస్తున్న ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ఇలా వున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ జె7 (2016) ఫీచర్లు...
5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే,
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.6 జీహెచ్‌జెడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ జె7 (2016) ఫీచర్లు...
5.20 డిస్ ప్లే
1.2 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్,
5 మోగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
720x1280 పిక్సెల్ రిజల్యూషన్,
2జీబీ ర్యామ్,
6.0.1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
3100 ఎంఏహెచ్ బ్యాటరీ
రేడియంట్ గోల్డ్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్, వేరియంట్లలో మంగళవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మార్చిలో చైనాలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్లు, కొరియాలో గతవారం మార్కెట్లను పలకరించాయి.