గాయత్రి యజ్ఞంలో ముస్లిం మహిళ
మానుకోటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఎస్.లోయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గణేశ్ గాయత్రి యజ్ఞం నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక విద్యార్థులు మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి పాఠశాలలో ప్రతిషి్ఠంచి పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ముస్లిం మహిళ జహేరా.. గణేశ్ గాయత్రి యజ్ఞంలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని.. ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కోరారు. – మహబూబాబాద్ రూరల్