Ganda Movie
-
కొత్త ప్రయోగంతో...
‘‘జీరో బడ్జెట్‌తో ‘గండ’ సినిమాని తీసి, వినూత్న ప్రయోగానికి తెరతీశాం. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాని అందరూ ఆదరించాలి’’ అని వారణాసి సూర్య అన్నారు. ఈజీ మూవీస్ బేనర్‌పై వారణాసి సూర్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘గండ’ మూవీ రేపు(శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వారణాసి సూర్య మాట్లాడుతూ–‘‘మా ఈజీ మూవీస్ సంస్థ త్వరలో ఓ పెద్ద సంస్థతో కలిసి కొత్త ్ర΄ాజెక్ట్స్ చేయనుంది. అలాగే విజయ్ జెడని దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో జీరో బడ్జెట్ సినిమా చేయబోతున్నాం. ఇండస్ట్రీలో కేవలం పింఛన్‌పై ఆధారపడిన చిన్న నిర్మాతలకు మా సంస్థ ద్వారా సాయం చేయాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. -
తెలుగులో మొదటి జీరో బడ్జెట్ మూవీ ‘గండ’
‘‘వారణాసి సూర్య జీరో బడ్జెట్లో తీసిన ‘గండ’ చిత్రం గురించి విని ఆశ్చర్యపోయాను.. ఆనందించాను. డబ్బు లేకున్నా సినిమా చేయాలన్న ఉత్సాహం, తపన ఉంటే చాలని ఈ సినిమాతో నిరూపిస్తున్నారు. ఈజీ సినిమా సంస్థ ప్రయోగం ఎంతో మంది ఔత్సాహికులకు ఆదర్శంగా నిలవాలి.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ కావాలి’’ అని ప్రముఖ రచయిత శివశక్తి దత్త అన్నారు. (చదవండి: అందుకే సుమంత్ ప్రభాస్ అని పేరు పెట్టుకున్నా : ‘మేమ్ ఫేమస్’ హీరో) నూతన నటీనటులతో వారణాసి సూర్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘గండ’. ఈ సినిమా టీజర్‌ని శివశక్తి దత్త విడుదల చేశారు. వారణాసి సూర్య మాట్లాడుతూ– ‘‘జీరో బడ్జెట్ మూవీస్ చేయొచ్చని పన్నెండేళ్ల క్రితమే రామ్‌గోపాల్ వర్మగారు చెప్పారు. తెలుగులో మొదటి జీరో బడ్జెట్ మూవీ ‘గండ’. ఈ సినిమాపై మా టీమ్ అంతా ఐదేళ్లు వర్క్ చేశాం. మా టీమ్ అంతా కొత్తవారే. కంటెంట్ నమ్ముకుని ఈ సినిమా తీశాం. ఇకపైన కూడా మా ఈజీ సినిమా సంస్థ నుండి జీరో బడ్జెట్ చిత్రాలు వస్తాయి’’ అన్నారు.