గణేశ్ నిమజ్జనంలో అపశృతి
అర్ధవీడు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఎగ్గెన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనంలో అపశృతి జరిగింది. స్థానిక ఎనమలేరు వాగులో గణేశుడి నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రామయ్య(60) అనే వృద్ధుడు అదుపుతప్పి నీళ్లలో పడిపోయాడు. తోటివారు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మృత దేహాన్ని వెలికి తీశారు. రామయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు. పండగ పూట ప్రమాదం జరగడంతో గ్రామలు విషాదఛాయలు అలుముకున్నాయి.