డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించండి
ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్: దొంతాలి డంపింగ్‌యార్డు సమస్యను వెంటనే పరిష్కరించకుంటే చెత్తను కార్పొరేషన్ కార్యాలయంలో వేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. గ్రామంలో శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు సారె పెట్టి ఆశీర్వదించారు. అనంతరం ఉచిత వైద్యశిబిరాన్ని పరిశీలించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ దొంతాలి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నిత్యం ఈగలతో సహవాసం చేస్తూ భోజనం చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పింఛన్ల మంజూరులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అర్హులలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుం డా చూడాలన్నారు. జన్మభూమి కార్యక్రమం పూర్తయిన వెంటనే అన్ని ప్రాంతాల్లో తాను పర్యటిస్తానన్నారు. వృ ద్ధుల కళ్లలో ఆనందం చూడటం తనకెంతో సంతోషమని ఆయన పేర్కొన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ మలినేని రత్నమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లూరు లక్ష్మమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హరిశివారెడ్డి, నాయకులు మలినేని వెంకయ్యనాయుడు, అనిల్, భాస్కర్‌నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.