దాడులు ముమ్మరం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలో గ్యాస్ అక్రమ వినియోగంపై అధికారులు మూకుమ్మడి దాడులు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు రంగంలోకి దిగారు. దాదాపు అన్ని మండలాల్లోనూ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా 33 గృహోపయోగ, 30 వాణిజ్య సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 38 కేసులు నమోదు చేశారు. ఆరు బృందాల్లో ఒక బృందం జేసీ బంగ్లా ఎదురుగా ఉన్న రెండు టీ స్టాళ్లు, శివరాం స్వీట్స్, ఆర్అండ్బీ బంగ్లా, ఉడాకాలనీల వద్ద గల మానస హొటల్, విజయవాడ టిఫిన్ సెంటర్లలో దాడులు చేపట్టింది.
అక్రమంగా వినియోగిస్తున్న ఎనిమిది గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం దా డులు నిర్వహించి గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామని, 6ఏ కేసులు నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ కె.జగదీశ్వరరావు, తనిఖీ బృందం అధికారి, బొబ్బిలి సీఎస్‌డీటీ ఎన్వీ రమణ తెలిపారు. అదే విధంగా మరో బృందం 14 కేసులు నమోదు చేసి 24 సిలిండర్లు స్వాధీనం చేసుకుంది. ఇందులో 13 కమర్షియల్, 11 డొమెస్టిక్ సిలిండర్లున్నాయని సీఎస్డీటీలు కోరాడ ప్రసాదరావు, ఎ.సూర్యనారాయణ, ఎన్ఫోర్స్మెంట్ అధికారి రామభద్రరాజు తెలిపారు.
వాణిజ్య సిలిండర్లు ఉన్నా.. కేసులు తప్పవు
జిల్లాలోని వాణిజ్య సముదాయాలు, వివిధ హొటళ్లలో ఇతరుల కు చెందిన గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారన్న సమాచారం ఉందని తనిఖీ బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లు లభించడంతోపాటు అవసరం కన్నా తక్కువ వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్న కారణంగా వాటిని కూడా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. వాణిజ్యగ్యాస్వినియోగిస్తున్న వారిపేరునే బాండ్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఇదిలా ఉండగా.. జేసీ బి.రామారావు ఆదేశాలమేరకు బుధవారం ఉదయం నుంచే దాడు లు నిర్వహించారు. బొబ్బిలి, గరివిడి ఉప తహశీల్దార్లతో కల సి ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ దాడుల్లోపాల్గొన్నారు. వివిధప్రాం తాల్లో ఏకకాలంలో దాడులుకొనసాగించారు. అయితే దాడు లు సాగుతున్నట్లు సదరు వ్యాపారులకు సమాచారం వెళ్లడం తో ముందుగానే చాలా మంది అప్రమత్తమయ్యూరు. గుట్టుచప్పుడు కాకుండా దుకాణాలు మూసేశారు. అరుునప్పటికీ ఎవరినీ వదిలిపెట్టేది లేదని, వరుసగా తనిఖీలు కొనసాగిస్తా మని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను స్థానిక గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు చెప్పారు.
అక్రమ ఫిల్లింగ్ మాటేమిటి?
జిల్లాలోని వాణిజ్య అవసరాలకు ఎక్కువగా గ్యాస్ వినియోగమవుతోంది. కానీ ఈ సిలిండర్ల కొనుగోలు మాత్రం తక్కువగా జరుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ హొటళ్లు, టీ స్టాళ్లు, మెస్‌లు, ఫుడ్ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు గృహవినియోగ సిలిండర్లను కొనుగోలు చేసి.. అక్రమంగా వినియోగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నారుు. అదే విధంగా పలుచోట్ల అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ కూడా జరుగుతోంది. ఇక నుంచి ఫిల్లింగ్ చేసే వారిపైనా దృష్టి సారిస్తామని ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ జగదీశ్వరరావు తెలిపారు. అదేవిధంగా వాహనాలకు కూడా గ్యాస్ ఫిల్లింగ్ జరుగుతున్నట్టు తమ వద్ద సమాచారముందని తెలిపారు. ఇదిలా ఉండగా.. గృహావసర గ్యాస్ సిలిండర్ల నుంచి వాణిజ్య సిలిండర్లకు గ్యాస్‌ను మార్చుతున్నారన్న అనుమానాలను తనిఖీ బృందాలు వ్యక్తం చేశాయి. చాలా వరకూ పెద్ద హొటళ్లలో కమర్షియల్ సిలిండర్లను తక్కువగా వినియోగించడం చూస్తే ఇది స్పష్టమవుతోందని గంట్యాడ నుంచి వచ్చిన తనిఖీ బృందంలోని సీఎస్‌డీటీ కోరాడ ప్రసాదరావు తెలిపారు. చిన్న ఇనుము పుల్లతో గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.