బాలయ్యకు కేంద్రమంత్రి శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాలను పాలించిన శాతవాహన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణిలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకొని శాతవాహనులు పాలించారని ఆయన గుర్తు చేశారు. ఒక గొప్ప చక్రవర్తి చరిత్రను తెలుగు యువ తరానికి చూపించడానికి చేస్తున్న ఒక మంచి చొరవగా..ఈ సినిమాను వెంకయ్యనాయుడు అభివర్ణించారు.
''క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విభజన ఉన్నా, శాతవాహన చక్రవర్తి వచ్చిన తర్వాత మనకంటూ ఒక శకం మొదలైంది. ఆ కథాంశంతో సినిమా తీయడం అభినందనీయం. బాలకృష్ణగారి వందో చిత్రం రెండొందల రోజులు ఆడాలి. ఈ సినిమా పూర్తయిన తర్వాత మొదటి ఆటను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూడా పేర్కొన్న విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాసరావు సమర్పణలో ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు చిరంజీవి కెమేరా స్విచ్చాన్ చేయగా, సీఎం కేసీఆర్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు.
Congratulations 2 Nandamuri Balakrishna 4 making a film on life of Gautamiputra Shatakarni, d Satavahana emperor who ruled Telugu state(1/2)
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 23 April 2016
wid Amaravati as his capital. Good initiative 2 make a film abt history of great ruler making young telugu generation know their history 2/2
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 23 April 2016