చంద్రబాబువి 420 ఆలోచనలు
వికృతరూపం..
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ధ్వజం
విజయవాడ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు 420(ఫోర్ట్వంటీ) అలోచనలు వి కృతరూపం దాల్చుతున్నాయని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరరలతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన పుట్టింది నాల్గో (ఏప్రిల్)నెల 20వ తేదీ అని, అందుకే చీటింగ్ మెంటాలిటీ ఉన్న ఆయన్ను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే రైతుల బోర్లకు విద్యుత్ తొమ్మిది గంటలకు మించి ఉపయోగిస్తే యూనిట్‌కు రూ.మూడు నుంచి రూ.తొమ్మిది చొప్పున భారం మోపుతున్నారని మండిపడ్డారు. తాజాగా మంచినీటి కుళాయిలకు నీటి మీటర్లు ఏర్పాటుుకు ప్రయత్నాలు చేయడం ప్రజలను దగా చేయడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు చంద్రబాబు సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
పీఎఫ్‌పై కేంద్రం వెనక్కి తగ్గడం శుభపరిణామం
ఉద్యోగుల భవిష్యనిధి(పీఎఫ్)పై విధించిన ఆం క్షలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్రం వెనక్కితగ్గడం శుభపరిణామం అన్నారు. కార్మిక వ్యతిరేక విధానలకు వ్యతిరేకంగా యూని యన్లు, కార్మికులు, ఉద్యోగులు సంఘటితంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గౌతంరెడ్డితోపాటు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ విజయవాడ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి పాల్గొన్నారు.