జీఈ ఖాతాలోకి అల్‌స్తోమ్ విద్యుదుత్పత్తి వ్యాపారం
డీల్ విలువ 12.4 బిలియన్ యూరోలు
లండన్: ఫ్రాన్స్‌కి చెందిన విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం అల్‌స్తోమ్ తమ విద్యుదుత్పత్తి, గ్రిడ్ వ్యాపార విభాగాలను అమెరికాకంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ దాదాపు 12.4 బిలియన్ యూరోలని అల్‌స్తోమ్ తెలిపింది. రైలు రవాణా వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
దీని ద్వారా వచ్చిన నిధుల్లో 700 మిలియన్ యూరోలను జీఈ సిగ్నలింగ్ విభాగం కొనుగోలుకు వెచ్చించనున్నట్లు పేర్కొంది. అలాగే, స్టీమ్, అణు విద్యుత్ తదితర రంగాల్లో జనరల్ ఎలక్ట్రిక్ తో 3 జాయింట్ వెంచర్ల ఏర్పాటుపై 2.4 బిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అల్‌స్తోమ్ తెలిపింది. ఈ డీల్ ఇరు కంపెనీలకు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చగలదని కంపెనీ చైర్మన్ ప్యాట్రిక్ క్రోన్ తెలిపారు.