దూరం పెంచే... దుష్టశక్తి!
ఎన్నో కలలతో ఆ యువతీ యువకుడు పెళ్లి చేసుకున్నారు. అనుకోకుండా ఓ దుష్టశక్తి వారి జీవితాల్లోకి ప్రవేశించి, ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఈ నేపథ్యంతో మహేష్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కలయా నిజమా’. రాజా, గీతా భగత్ జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ పాటలు స్వరపరిచారు. ఈ నెల 27న పాటలను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి గ్రాఫిక్స్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వచ్చే నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్స్: హిమబిందు, చిన్న పెరుమాళ్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్.