చెన్నైలో తప్పిన భారీ ప్రమాదం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నాసాలైలో రోడ్డు పది అడుగుల మేరకు కుంగడం కలవరాన్ని రేపింది. ఈ గోతిలో ఓ బస్సు, కారు చిక్కుకున్నాయి. ఈ మార్గంలో సైదాపేట నుంచి భూమార్గంలో మెట్రో రైలు పనులు సాగుతున్నాయి. డ్రిల్ బోరింగ్ మిషన్ల ద్వారా సొరంగానికి సంబంధించి తవ్వకాలు జరుగుతున్నాయి.
ఆదివారం బస్సు జెమినీ స్టాప్‌లో ఆగగా, ఒక్కసారిగా అతి పెద్ద గొయ్యి ఏర్పడింది. గోతిలోకి బస్సు కూరుకుపోతుండటంతో డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అటువైపుగా వెళుతున్న కారూ గొయ్యిలో చిక్కుకుంది. బస్సులో ఉన్న 35 మందితో పాటు, కారులో ఉన్న వారిని చుట్టుపక్కల వారు రక్షించి, సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రోడ్డును మూసివేశారు. బస్సు, కారును భారీ క్రేన్ సాయంతో బయటకు తీశారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)