బీజేపీ బలోపేతానికి కృషి
నెల్లిమర్ల రూరల్ : జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయూలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన నెల్లిమర్లలోని గాంధీనగర్ కాలనీలో జరిగి న ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతా ల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అధిష్ఠానంతో మాట్లాడిన తరువాత వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పివి గో పాలరావు మాట్లాడుతూ ప్రజలు నాయకులను ఎన్నుకున్నప్పుడే వారి గుణగుణాలు చూడాలన్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తల కు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.
ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరకవలస నాగమోహ న్కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అశోక్, మండల అధ్యక్షుడు నడిపేన నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి ఆల్తి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.