అమరావతి శంకుస్థాపనపై చీఫ్ సెక్రటరీ కసరత్తు
విజయవాడ : రాష్ట్ర రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సీఆర్డీఏ అధికారులతో సమీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) విజయవాడ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, కమిషనర్ శ్రీకాంత్, పర్యాటక ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎం.కె.మీనా, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే తదితరులు సమావేశమై ఏర్పాట్లను చర్చించారు.
చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ముఖ్య అతిథులు, విదేశీ అతిథులు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విశిష్ట అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికి తగిన ఏర్పాట్లు చేయాలని చీప్ సెక్రటరీ కృష్ణారావు ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగి, పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ ఎన్.వి.సురేంద్రబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంస్కృతిక డెరైక్టర్ కె.కన్నబాబు, విజయభాస్కర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) విజయవాడ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, కమిషనర్ శ్రీకాంత్, పర్యాటక ప్రిన్సిపల్ సెక్రటరీ నీరబ్ కుమార్, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఎం.కె.మీనా, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు బాబు.ఎ, కాంతిలాల్ దండే తదితరులు సమావేశమై ఏర్పాట్లను చర్చించారు. చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ ముఖ్య అతిథులు, విదేశీ అతిథులు, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విశిష్ట అతిథులకు సాదరంగా ఆహ్వానం పలికి తగిన ఏర్పాట్లు చేయాలని చీప్ సెక్రటరీ కృష్ణారావు ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశంలో కూలంకషంగా చర్చించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగి, పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ ఎన్.వి.సురేంద్రబాబు, కె.కన్నబాబు, కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.