లుపిన్ మరో ముందడుగు
న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ లూపిన్ మరో ముందడుగు వేసింది. జనరిక్ వెర్షన్ కు చెందిన యాంటి డి ప్రెసెంట్ డ్రగ్ పారోక్సిటైన్ అదనపు విడుదలకు అమెరికాలో తాత్కాలిక అనుమతి లభించిందని తెలిపింది. ఈ మేరకు అమెరికా హెల్త్ రెగ్యులేటరీనుంచి తమకు అనుమతి లభించిందని శుక్రవారం తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం వివిధ పరిమాణాల్లో ఈ మందు అమ్మకాలకు అనుమతి పొందినట్టు వెల్లడించింది.
12.5ఎంజీ, 25 ఎంజీ, 37.5 ఎంజీల అపోటెక్స్ టెక్నాలజీస్ కి చెందిన పాక్సిల్ సీఆర్ మాత్రల జెనెరిక్ వెర్షన్ కు తాత్కాలిక అనుమతి లభించిందనీ లూపిన్ బీఎస్ఇ పైలింగ్ లో తెలిపింది. డిప్రెసివ్ డిజార్డర్, తీవ్ర భయాందోళన రుగ్మత ,సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, ప్రీ మెనస్ట్రుయల్ తదితర సమస్యల్లో చికిత్సకు ఈ మందు ఉపయోగపడుతుందని పేర్కొంది. దీంతో మార్కెట్లో లుపిన్ కౌంటర్ లాభాల్లో నడుస్తోంది.