డా.రెడ్డీస్‌కు మరో వెనకడుగు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ లాబరేటరీస్‌కు భారీ వెనకడుగు. జర్మన్ రెగ్యులేటరీ ఈ కంపెనీకి మరోసారి భారీ షాక్ ఇచ్చింది. 6 మేజర్ అబ్జర్వేషన్లను జారీ చేసింది. విశాఖ పట్టణంలోని దువ్వాడ ప్లాంట్‌కు సంబంధించి వీటిని జారీ చేసింది.
జర్మనీ రెగ్యులేటరి అథారిటీ ఆడిట్లో విశాఖపట్నంలోని దువ్వాడకేంద్రంలో ఆరు అతిపెద్ద పరిశీలనలను నిర్ధారించిందని బీఎస్సీ ఫైలింగ్‌లో డా.రెడ్డీస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈయు-ఈఎంపీ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్టు రెగ్యులేటరీ హెచ్చరించిందని త్వరలో సీఏపీఏ (కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్)ను సంబంధిత అధికారులకు అందించనున్నట్టు తెలిపింది.
అయితే సదుపాయంలో తయారైన ఉత్పత్తులను ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి చేయడంలేదని ఫైలింగ్‌లో పేర్కొంది.
క్రిటికల్ అబ్జర్వేషన్ ఏమీ లేకపోయినప్పటికీ 6 ప్రధాన అబ్జర్వేషన్లను జారీ చేయడంతో డా.రెడ్డీస్ నష్టాల్లోకి జారుకుంది. 2018, నవంబరులో వీటిని మళ్లీ రివ్యూ చేపట్టనుంది. ఈ వార్తలతో డా.రెడ్డీస్ 7శాతానికిపైగా శాతం పతనమైంది.