Germany foot ball team
-
జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెర్డ్ ముల్లర్ కన్నుమూత
బెర్లిన్: జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెల్డ్ ముల్లర్(75) ఆదివారం కన్నుమూశాడు. ఫుట్‌బాల్ చరిత్రలో బెస్ట్ స్ట్రైకర్‌గా పేరు పొందిన ముల్లర్ 1974లో జర్మనీ ఫిఫా ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ గోల్ కొట్టిన ముల్లర్ జర్మనీకి ప్రపంచకప్ అందించాడు. ఓవరాల్‌గా జర్మనీ తరపున 62 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన ముల్లర్ 68 గోల్స్ చేశాడు. 1970లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 14 గోల్స్ చేసి ఆల్‌టైమ్ గోల్ స్కోరింగ్‌తో ముల్లర్ రికార్డు సృష్టించాడు. ఇక 1964 నుంచి బేయర్న్ మ్యూనిచ్ క్లబ్‌కు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ముల్లర్ 594 మ్యాచ్‌ల్లో 547 గోల్స్ చేశాడు. 2004లో ఫిఫా అత్యుత్తమ క్రీడాకారుల జాబితాలో ముల్లర్‌కు చోటు దక్కింది. Gerd Müller is one of the most important players in the history of FC Bayern. Photos from an extraordinary career: https://t.co/xScSrcqWpE pic.twitter.com/CgY4VFGo4s — FC Bayern English (@FCBayernEN) August 15, 2021 -
Tokyo Olympics: జాతి వివక్ష కామెంట్లు.. గ్రౌండ్ వీడిన ప్లేయర్స్
టోక్యో ఒలింపిక్స్ ముగింట ‘జాతి’ వివక్ష వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఆటగాడు జోర్డాన్ టోరునారిను ఉద్దేశించి ప్రత్యర్థి ఆటగాళ్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ అమెరికా జట్టు హోండురస్‌తో శనివారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. జపాన్ వాకయామా స్టేడియంలో ఇరు జట్లు తలపడగా.. ఆట మధ్యలో జోర్డాన్‌ను ఉద్దేశించి హోండురస్ ఆటగాళ్లు వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని జర్మన్ ఫుట్‌బాల్ అసోషియేషన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆటగాళ్లను విమర్శించినప్పుడు ఆటను కొనసాగించడం కరెక్ట్ కాదని, అందుకే మైదానం వీడినట్లు హెడ్‌కోచ్ స్టెఫాన్ కుంట్జ్ ఒక ప్రకటనలో చేసిన పనిని సమర్థించుకున్నారు. ℹ️ The game has ended 5 minutes early with the score at 1-1. The Germany players left the pitch after Jordan Torunarigha was racially abused.#WirfuerD #Tokyo2020 pic.twitter.com/D85Q63Ynr9 — Germany (@DFB_Team_EN) July 17, 2021 ఆట ముగియడానికి ఐదు నిమిషాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అప్పటికే స్కోర్ 1-1తో సమంగా ఉంది. అయితే గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య చిన్నగొడవ వల్లే అలా జరిగిందని హోండరస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటనను పలు దేశాల ఫుట్‌బాల్ ఫెడరేషన్లు ఖండిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కమిటీ ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే నైజీరియా సంతతికి చెందిన టోరునారిగా ఇలాంటి వివక్షకు గురికావడం ఇదే తొలిసారి కాదు. కిందటి ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా చాకె ఫ్యాన్స్ ‘మంకీ’ నినాదాలతో గ్రౌండ్‌ను హోరెత్తించారు. -
జర్మనీ కెప్టెన్ లామ్ రిటైర్మెంట్
బెర్లిన్: జర్మనీ ఫుట్‌బాల్ జట్టును విశ్వ విజేతగా నిలిపిన కెప్టెన్ ఫిలిప్ లామ్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 30 ఏళ్ల డిఫెండర్ లామ్ 113 మ్యాచ్‌ల్లో పాల్గొని ఐదు గోల్స్ చేశాడు. ‘బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నా కెరీర్‌కు చివరిదని ముందే నిర్ణయించుకున్నాను. ఇక చాంపియన్‌గా నిలిచిన అనంతరం ఇదే సరైన నిర్ణయమనిపించింది’ అని లామ్ పేర్కొన్నాడు. అయితే ఈ స్టార్ ఆటగాడు బేయర్న్ మ్యూనిచ్ తరఫున క్లబ్ ఫుట్‌బాల్ ఆడనున్నాడు. గూగుల్ సెర్చ్‌లో మెస్సీ, రొనాల్డో టాప్ న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ సందర్భంగా గూగుల్‌లో అత్యధిక మంది అభిమానులు ‘సెర్చ్’ చేసిన ఆటగాళ్లలో అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలిచారు. అలాగే టోర్నీకి సంబంధించిన వివరాల గురించి 210 కోట్ల మంది ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టు గూగుల్ తెలిపింది. గోల్ కీపర్లలో అమెరికాకు చెందిన టిమ్ హోవర్డ్ అగ్రస్థానంలో నిలిచాడు.