ఆ ప్రశ్నతో నాకు విసుగు రాలేదు...
న్యూఢిల్లీ: టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం సాధించిన రికార్డులుఅన్నీ ఇన్నీ కావు. అదే సందర్భంలో ఈ రికార్డులుకంటే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ ప్రశ్నలపై చిత్ర దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. పదే పదే అందరూ అడుగుతున్న ఆ ప్రశ్నపై అస్సలు విసుగు రాలేదు సరికదా ..చాలా ఆనందంగా అనిపించిందని మీడియాతో చెప్పారు. లెక్కలేనన్ని సార్లు, తాను, తన టీం ఈ ప్రశ్నను ఎదుర్కొన్నామని.. అయినా తమకేమీ విసుగు అనిపించలేదని రాజమౌళి తెలిపాడు. ఒక విధంగా బాహుబలి చిత్రం భాషలకతీతంగా సాధించిన విజయానికి ఇది నిదర్శనమని రాజమౌళి పేర్కొన్నారు. బాహుబలి రెండవ భాగంపై ప్రజల్లో నెలకొన్న ఉత్సుకతకు ఇది తార్కాణమన్నారు. తనుగానీ, తన టీంగానీ ఎలాంటి ఒత్తిడిని ఫేస్ చేయలేదనీ, చాలా ఎగ్టైటింగా, ఆ అనుభూతి చాలా అద్భుతంగా అనిపించిందని పిటిఐతో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆకర్షించడం, టెక్నికల్ అంశాలపై ప్రశంసలు రావడం భారతదేశం అరుదైన చిత్రాలలో ఒకటిగా నిలివడం గర్వంగా ఉందన్నారు. కథా బలం ఉంటే ప్రేక్షకుల ఆదరణ పొందడం కష్టం కాదని చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలచేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు. దీంతోపాటుగా ఇండియా తరువాత చైనా లోపెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రాజ ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న బాహుబలి రెండవ భాగాన్ని భారతదేశం కంటే భారీగా 6500 స్క్రీన్లపై సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. అయితే సెకండ్ పార్ట్ విడుదలలో ఆలస్యం కావాలసి చేసింది కాదని వివరణ ఇచ్చారు. దిలార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది, హాబిట్, బ్యాట్ మెన్ సినిమాల సీక్వెల్స్ సంవత్సరం తరువాత వచ్చాయంటూ గుర్తు చేశారు. అలాగే బాహుబలి విడుదల కూడా ఆలస్యమైందన్నారు. మొదటి భాగం భారీ విజయం పరిగణనలోకి తీసుకుంటే బాహుబలి సీక్వెల్ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. బాహుబలి - ది కన్క్లూజన్ భారీ విజయం సాధిస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దీనిగురించి నాపై పెద్ద ఒత్తిడి లేదు.. నిజానికి ప్రేక్షకుల అంచనాలే ఒత్తిడిని తగ్గించిందనీ, ఒత్తిడి నివారణగా పనిచేసిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.