సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
జన్మభూమిలో గెజిటెడ్ అధికారుల వినతి
తొండవరం(అంబాజీపేట) :
కాంట్రిబ్యూటరీ పింఛ¯ŒS విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి పాత పింఛ¯ŒS పద్ధతిలో కొనసాగించాలని అంబాజీపేట ఎంపీడీఓ, జిల్లా ఏపీసీపీఎస్ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. అంబాజీపేట మండలం తొండరంలో మంగళవారం జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీఓ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు వినతిపత్రాన్ని ప్రజాప్రతినిధులకు అందజేశారు. విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ విధానం అమలులోకి వచ్చాక 120 మంది ఉద్యోగులు మరణించగా ప్రభుత్వం పరంగా సాయం అందక కుటుంబాలు రోడ్డున పడ్డాయని జన్మభూమిలో ప్రజాప్రతినిధులకు వివరించారు. ఎంపీడీఓ విశ్వనాథ్, తహసీల్దారు ఏబీవీఎస్బీ శ్రీనివాస్, వైద్యాధికారి వి.పద్మదీపిక, ఏఓ ఎం.విజయలక్ష్మి, హౌసింగ్ ఏఈ డి.శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సీహెచ్ చినబాబు వినతిపత్రాన్ని ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబులకు అందజేశారు.