హరితహారంలో భాగస్వాములు కండి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి : నాటిన మొక్కలను, సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. ఆదివారం మున్సిపాలిటీలో 18వ వార్డు రైల్వే స్టేషన్ ఏరియాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాల ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోందన్నారు.
ఖాళీ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల పరిసరాలు, రహదారుల పక్కన విస్తారంగా మొక్కలు నాటాలన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్పర్సన్ సునీతారాణి మాట్లాడుతూ హరితహారంలో మహిళలు, చిన్నారులు, యువకులు ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లింగంపల్లి రాములు, మధు, పుర్రçపజలు, మహిళలు పాల్గొన్నారు.
నెన్నెల : మండలంలోని నందులపల్లి జీపీ కార్యాలయ ఆవరణలో, నెన్నెల పీఏసీఎస్ నూతన కార్యాలయ నిర్మించే స్థలంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మొక్కలు నాటారు. నందులపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 14 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధాక్రిష్ణ, జెడ్పీటీసీ కొడిపె భారతి, పీఏసీఎస్ చైర్మన్ ఇందూరి రమేష్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇబ్రాహీం, ఏపీఎం విజయలక్ష్మి, నందులపల్లి ఎంపీటీసీ పంజాల లక్ష్మి, సర్పంచ్ సాగర్గౌడ్, ఆర్ఐ గోవింద్, ప్రకాశ్ గౌడ్, నాయకులు బీమాగౌడ్, సున్నం రాజు, రాజాగౌడ్, గొళ్లపల్లి సర్పంచ్ తిరుపతిగౌడ్, పంచాయతీ కార్యదర్శి పద్మనాభం పాల్గొన్నారు.
హరితహారం కళాజాత
నెన్నెల, గొళ్లపల్లి గ్రామాల్లో ఆదివారం తెలంగాణ సంÜ్కతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో హరితహారంపై కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఆటపాటల ద్వారా మొక్కల ప్రాముఖ్యతను వివరించారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ప్రదర్శనలు ఇచ్చారు. తహసీల్దార్ వీరన్న, నెన్నెల, గొళ్లపల్లి సర్పంచులు ఆస్మా, తిరుపతిగౌడ్, కళాకారులు ముల్కల్ల మురళి, సల్లూ ýSష్ణ, సురేందర్, చింత రాయమల్లు, రవీందర్, నిరోష, శిరీష, అపూర్వ ఉన్నారు.
కాసిపేట : మండలంలోని సోనాపూర్లో తహసీల్దార్ కవిత మొక్కలు నాటారు. జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, సర్పంచ్ లక్ష్మి, పంచాయితి కార్యదర్శి కవిత, పాల్గొన్నారు.
మండలంలోని కోమటిచేనులో జేపీవో ధరంపాల్ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ ఇంటింటికి మొక్కలు పెంచుతు పచ్చదనాన్ని కాపాడటంతొ పాటు పర్యావరణ పరిరక్షణకు కషిచేయాలన్నారు. పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
తాండూర్ : మండలంలోని బోయపల్లిలో పొలంగట్లపై పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఎంపీపీ మాసాడి శ్రీదేవి మొక్కలు నాటారు. రైతులకు వెయ్యి మొక్కలను పంపిణీ చేశారు. తాండూర్ సీఐ కరుణాకర్, సర్పంచ్ మిట్ట వేణుగోపాల్, తహశీల్దార్ రామ^è ంద్రయ్య, నాయకులు మాసాడి శ్రీరాములు, సునార్కార్ మల్లేష్ పాల్గొన్నారు.
వేమనపల్లి : హరితహారం కార్యక్రమంలో మేము సైతం అంటూ మాజీ మావోయిస్టులు గట్టయ్య, గోదావరి దంపతులు, మధునయ్య, ఆటోడ్రైవర్లు పాల్గొనగా వీరికి నీల్వాయి పోలీసులు అండగా నిలిచారు. నీల్వాయి ఎసై ్స శ్రీకాంత్ ఆధ్వర్యంలో నీల్వాయి, మామడ వన నర్సరీల నుంచి మొక్కలు తెప్పించారు. మారుమూల గ్రామం బద్దంపల్లిలో, మంగనపల్లి రోడ్డు వెంట మాజీ మావోయిస్టులు, నీల్వాయికి చెందిన ఆటో డ్రై వర్, ఓనర్ల యూనియన్ నాయకులతో మొక్కలు నాటించారు. సుమారు 500 వరకు వేప, కానుగ, నేరేడు మొక్కలు నాటినట్లు ఎసై ్స తెలిపారు. ఎకై ్సజ్ ఎసై ్స దిలీప్, జేపీవోలు కమలాకర్, పర్వతాలు, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళ్ల మల్లాగౌడ్ పాల్గొన్నారు.