బాక్సర్ ఘనీచాంద్ మృతి
హైదరాబాద్: జాతీయ మాజీ బాక్సింగ్ చాంపియన్, సర్వీసెస్ సీనియర్ విభాగం బాక్సింగ్ చాంపియన్ ఎస్ఏ ఘనీచాంద్ (74) గురువారం రాత్రి కన్నుమూశారు. రక్షణశాఖలో వివిధ హోదాలలో పని చేసిన ఆయన వరుసగా 17 సంవత్సరాలు సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహించి, 8 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత ఆయన గోల్కొండ బాక్సింగ్ అసోసియేషన్ స్థాపించి యువకులకు బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
ఇతని కుమారుడు ఎజాజ్ తెలంగాణ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడు. ఘనీ చాంద్ అంత్యక్రియలు శుక్రవారం మ«ధ్యాహ్నం జరిగాయి. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.