ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులకు చిక్కాడు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 గణాంకశాఖ అధికారి నిత్యానంద శనివారం సాయంత్రం లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రెజిమెంటల్ బజార్‌కు చెందిన ఉమాదేవి తన ఇంటి మ్యుటేషన్ కోసం రూ.2,000 లంచం ఇస్తుండగా ఆయన దొరికిపోయారు. ప్రస్తుతంఆయన కార్యాలయంతోపాటు బోయిన్‌పల్లిలోని ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.