గిఫ్టింగ్‌లో నయా ట్రెండ్
పండుగలల్లో బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్స్ ఇచ్చే విధానం మారుతోంది. ఒకప్పుడు ఇలాంటి ప్రత్యేక రోజుల్లో స్వీట్లు,డ్రైఫ్రూట్లను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ ఆక్రమిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆన్లైన్ వోచర్లు, గిఫ్ట్ కార్డ్స్‌కు గిరాకీ పెరుగుతోంది, స్టార్టప్స్, ఇతర సంస్థలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాటి కార్పొరేట్ గిఫ్ట్స్ కోసం డిజిటల్ గిఫ్టింగ్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి.
డిజిటల్ గిఫ్టింగ్ అంటే..
డిజిటల్ గిఫ్టింగ్ విధానంలో ఆన్లైన్ వోచర్లు, గిఫ్ట్ కార్డులు, ఈ-గిఫ్టింగ్ అనే అంశాలుంటాయి. గిఫ్ట్ కార్డ్స్ చూడటానికి మన క్రెడిట్, డెబిట్ కార్డులాగే ఉంటాయి. ఈ-గిఫ్టింగ్‌లో గిఫ్ట్స్ డెరైక్ట్‌గా మెయిల్‌కే వస్తాయి. వోచర్ల విషయానికి వస్తే.. ఎంపిక చేసిన రిటైల్ షాప్‌ల్లో ఇచ్చిన నిర్ణీత ధరల్లో నచ్చిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అలాగే వీటికి కాల పరిమితి కూడా ఉంటుంది.
సొల్యూషన్స్‌ను అందిస్తున్న పలు సంస్థలు
డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్‌ను పలు సంస్థలు అం దిస్తున్నాయి. పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పైన్ ల్యాబ్స్, ఈ-గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్ క్విక్కిల్వర్, ఆన్లైన్ గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్ గిఫ్ట్జోజో, ఆఫీస్ సప్లై ఈ-కామర్స్ పోర్టల్ జోఫియో వంటి సంస్థలు డిజిటల్ గిఫ్టింగ్ విభాగంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
పైన్ ల్యాబ్స్‌లో క్రోమా, బిగ్ బజార్, సినీపోలిస్, స్పైస్ హాట్‌స్పాట్, గోద్రేజ్ నేచర్స్ బాస్కెట్, మెయిన్‌ల్యాండ్ చైనా, పిజా హాట్ వంటి 100పైగా బ్రాండ్స్ సంబంధిత గిఫ్ట్ వోచర్లను పొందొచ్చు.
డిజిటల్ గిఫ్టింగ్ ప్రయోజనాలు
సంప్రదాయ పద్ధతుల్లోని గిఫ్టింగ్ విధానంతో పోలిస్తే డిజిటల్ గిఫ్టింగ్‌లో పలు ప్రయోజనాలు ఉన్నాయి. డిజిటల్ గిఫ్టింగ్ విధానంలో ఎలాంటి లాజిస్టిక్ చార్జీలు లేకుండా వెంటనే గిఫ్ట్‌ను డెలివరీ చేయొచ్చు. కార్పొరేట్ సంస్థలు వారి ఉద్యోగులందరి అభిరుచులకు తగ్గట్టుగా గిఫ్ట్స్‌ను అందించడానికి డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ ఒక సులువైన మార్గమని పైన్ ల్యాబ్స్ సీఈవో లొక్వీర్ కపూర్ తెలిపారు.
శామ్సంగ్, మ్యాక్స్ బుపా, మాస్టర్ కార్డు, బ్రిటిష్ ఏయిర్‌వేస్, ఏయిర్టెల్ వంటి తదితర పెద్ద పెద్ద కంపెనీలు కూడా డిజిటల్ గిఫ్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించాయని పేర్కొన్నారు. డిజిటల్ గిఫ్ట్ కార్డ్స్ విధానంలో గిఫ్ట్ గ్రహీతలు వారికి కావాల్సిన, నచ్చిన బహుమతులను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని క్విక్కిల్వర్ సీఈవో కుమార్ సుదర్శన్ తెలిపారు.
డిజిటల్ గిఫ్టింగ్ విధానంలో నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని చెప్పారు. ‘ఉద్యోగి తన కంపెనీ నుంచి ఒక గిఫ్ట్‌ను పొందడానికి కన్నా ఆన్లైన్ గిఫ్ట్ వోచర్‌ను తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆన్లైన్ గిఫ్ట్ వోచర్లో అతనికి కావాల్సిన గిఫ్ట్‌ను ఎంచుకోవడంలో స్వేచ్ఛ ఉంటుంది’ అని వివరించారు.
సంప్రదాయ గిఫ్టిం గ్లో ఉన్న ఎంపిక, డెలివరీ ఖర్చులు వంటి సమస్యలు డిజిటల్ గిఫ్టింగ్‌లో ఉండవని జోఫియో సీఈవో అభిషేక్ కుమాని తెలిపారు. ఉద్యోగులు అధికంగా ఉండే సంప్రదాయ తయారీ కంపెనీలు ఇంకా డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ విషయంలో వెనుకంజలో ఉన్నాయని గిఫ్ట్జోజో సహ వ్యవస్థాపకులు మనోజ్ తెలిపారు. గత మూడేళ్లలో తాము 200 క్లయింట్స్‌కు డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ సేవలను అందించామన్నారు.
కొత్త దారిలో వెళ్తున్న స్టార్టప్స్
స్టార్టప్స్ వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. తన కస్టమర్లు, ఉద్యోగులకు పండుగ సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నాయి. అర్బన్‌క్లాప్, ఈజీఫిక్స్ వంటి స్టార్టప్స్ దీపావళి సందర్బంగా వాటి కస్టమర్లు, ఉద్యోగులకు బోనస్‌తోపాటు ఇంటీరియర్ డెకరేషన్ నుంచి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ వరకు ఇన్స్టాంట్ ప్రొఫెషనల్ సొల్యూషన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఈజీరివార్డ్జ్ అయితే తన ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది.