అప్పన్న సన్నిధిలో ఒడిశా మాజీ సీఎం
హాచలం : శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామిని గురువారం ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన జరిపారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ అందజేశారు.