girl fined
-
ప్రియురాలి కోసం గుండు చేసుకున్నాడు
నిజమైన ప్రేమను మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. మనం చేసే పనుల ద్వారా అవతలి వారి పట్ల ఎంత ప్రేమ ఉందో చూపిస్తాం. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రియురాలికి మద్దతుగా ఓ యువకుడు గుండు గీసుకుని ఆమె మీద ఉన్న ప్రేమను వెల్లడించాడు. ఇది చూసిన నెటిజనులు సదరు వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మాన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఓ యువతి అలోపేసియా(పేనుకొరుకుడు) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. రోగ నిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్ల మీద దాడి చేయడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఫలితంగా ప్యాచెస్ ప్యాచెస్‌గా జుట్టు రాలిపోతుంది. ప్రాంరంభంలో చిన్నగా ఉన్న ఇది రానురాను పెద్దగా మారుతుంది. (భార్యపై అనుమానం.. గ్రామస్తులతో కలిసి) ఈ క్రమంలో సదరు యువతి కూడా ఈ వ్యాధితో బాధపడుతుంది. దాంతో ఆమె ప్రేమికుడు ట్రిమ్మర్‌తో యువతికి గుండు చేస్తాడు. ఇష్టంగా పెంచుకున్న జుట్టును కోల్పోవాల్సి రావడంతో యువతి ఎంతో ఆవేదనకు గురవుతుంది. ఆమెకు గుండు చేయడం పూర్తయిన తర్వాత ఆకస్మాత్తుగా తనకు గుండు చేసుకోవడం ప్రారంభిస్తాడు సదరు యువకుడు. ఇది చూసి ఆమె షాక్ అవుతుంది. ఏడుస్తుంది. జుట్టు కోల్పోయి బాధపడుతున్న ప్రియురాలకి మద్దతు తెలపడం కోసం సదరు యువకుడు ఇలా తనకు తానే గుండు చేసుకున్నాడు. మానవత్వం మిగిలి ఉందనడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటూ రెక్స్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నెటిజన్లు సదరు యువకుడిని తెగ ప్రశంసిస్తున్నారు. -
పెళ్లి వద్దందని.. రూ. 16 లక్షల జరిమానా!
చిన్ననాడు కుదిర్చిన పెళ్లిని రద్దు చేసుకోవాలని చెప్పినందుకు రాజస్థాన్‌లోని పంచాయతీ పెద్దలు ఆగ్రహించి.. ఓ యువతికి ఏకంగా రూ. 16 లక్షల జరిమానా విధించారు. ఆమె కుటుంబానికి కుల బహిష్కరణ శిక్ష కూడా విధించారు. జోధ్‌పూర్ తాలూకా రోహిచాన్ ఖుర్ద్ గ్రామానికి చెందిన శాంతాదేవి మేఘ్వాల్ అనే యువతికి 11 నెలల వయసు ఉండగానే పెళ్లి నిశ్చయం చేసేశారు. ఆ విషయం ఆమెకు మూడేళ్ల క్రితమే తెలిసింది. ప్రస్తుతం కాలేజిలో చదువుతున్న ఆమె.. ఈ పెళ్లి తనకు వద్దని చెప్పింది. దాంతో ఆమె అత్తమామలకు కోపం వచ్చి.. పంచాయతీ పెద్దల వద్దకు వివాదాన్ని తీసుకెళ్లారు. పంచాయతీ పెద్దలు ఆమెకు రూ. 16 లక్షల జరిమానా విధించి, ఆమె కుటుంబాన్ని కులం నుంచి వెలేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సాయం కోసం ఆమె ప్రయత్నిస్తోంది.