బాలిక ఒంటిపై వాతలు పెట్టిన యజమాని
తూ.గో: ఓ బాలికనుఇంటి యజమాని చిత్రహింసలకు గురి చేసి, ఒంటిపై వాతలు పెట్టిన ఘటన కాకినాడ పట్టణంలో వెంకట నగర్ కాలనీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం గ్రామానికి చెందిన బాలిక ఓ ఇంట్లో పని కుదిరింది. పనిలో చేరినప్పట్నుంచీ ఆ బాలికను ఇంటి యజమాని వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ బాలికను నానా ఇబ్బందులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక ఒంటిపై వాతలు కూడా పెట్టాడు. ఈ విషయం రాజీవ్ విద్యామిషన్ అధికారులకు తెలియడంతో బాలికను రక్షించారు.