కాలేజీకి వెళ్లి గొంతుకోశాడు
ఘజియాబాద్: ఉత్తర ప్రదేశ్లోదారుణం చోటుచేసుకుంది. పీజీ చదువుతున్న విద్యార్థి ఓ విద్యార్థిని గొంతుకోశాడు. అనంతరం తాను విషం తీసుకున్నాడు. యూపీలోని ఘజియాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఘజియాబాద్‌లోని శంబు దయాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తికి బాధితురాలికి మధ్య కొద్ది రోజులుగా అన్యోన్య సంబంధం ఉంది.
అయితే, మంగళవారం కాలేజీకి వచ్చిన ప్రశాంత్ అనే పీజీ విద్యార్థి ఆ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గొంతుకోసి తాను విషం తాగాడు. దీంతో బాధితురాలు కేకలు పెట్టగా మిగితా విద్యార్థులు అక్కడి చేరుకొని ప్రశాంత్ ను చితక్కొట్టారు. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన ప్రశాంత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.