రతన్ టాటాకు ఐసీఎఫ్ఏ అవార్డు
ముంబై: టాటా గ్రూపు అధినేత రతన్ టాటాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) 'గ్లోబల్ వ్యవసాయ లీడర్షిప్ అవార్డు 2016 " అవార్డు వరించింది. సెప్టెంబరు 18 న న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల వేడుకకు రతన్ టాటా హాజరు కాలేదు. దీంతో ముంబైలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును టాటా సన్స్ తాత్కాలిక ఛైర్మన్ కు ప్రదానం చేశారు.
హరిత విప్లవం మార్గదర్శకుడు ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైన "లీడర్షిప్ అవార్డులు జ్యూరీ, భారత దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ అభివృద్ధికి ఐదు దశాబ్దాలకు పైగా అందించిన రతన్ టాటా సేవలకుగాను లైఫ్ టైం ఎఛీవ్మెంట్ అవార్డు 2016 కు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆయన కృషి దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు జీవితాలపై ఆయన సానుకూల ప్రభావాన్ని చూపించిందని ఐసీఎఫ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది.