ఎయిడ్స్‌కు హోమియోపతి చికిత్స
చెన్నై : హోమియోపతి చికిత్సతో హెచ్ఐవీ వైరస్‌ను సైతం నివారించవచ్చని పరిశోధనల్లో రుజువైనట్లు గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జయేష్ వి.సంఘ్వి, పీఆర్వో డాక్టర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 90 శాతం పరిశోధనల్లోనూ, పది శాతం చికిత్స ద్వారా నిర్ధారించుకున్నామని వారు చెప్పారు.
మంగళవారం చెన్నైలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జేఎస్పీఎస్ ప్రభ్వు హోమియోపతి వైద్య కళాశాల (హైదరాబాద్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(హైదరాబాద్)కు చెందిన వైద్యులు జరిపిన పరిశోధనల ద్వారా కనుగొన్న క్రొటాలస్ సారిడస్ అనే మందు ద్వారా ప్రాణాంతక వ్యాధులైన ఎయిడ్స్, ఎబోలా, హెపటైటిస్ బీ వైరస్‌లను సమూలంగా నివారించవచ్చని రుజువైందని తెలిపారు. ముంబ యికి చెందిన డాక్టర్ రాజేష్ షా సైతం రెండేళ్ల పరిశోధనలతో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి నివారణకు మందు కనుగొన్నారని చెప్పారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో ఈ ఎయిడ్స్ నివారణ గురించి ప్రచురితమైందన్నారు.
ముంబయిలో అంతర్జాతీయ సదస్సు
హోమియోపతి వైద్యంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక విధానాలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 11, 12 తేదీల్లో ముంబయిలో ‘వరల్డ్ హోమియోపతి సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జయేష్ వి.సంఘ్వి, డాక్టర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమ్మిట్‌లో వివిధ దేశాలకు చెందిన 9 మంది స్పీకర్లు ప్రసంగిస్తారని, అలాగే 25 మంది శాస్త్రవేత్తలు హోమియోపతి వైద్యంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక చికిత్స విధానాలను వివరిస్తారని చెప్పారు.
సైడ్‌ఎఫెక్ట్స్‌లేని, అతి చౌకైన, వ్యాధిని సమూలంగా నివారించగల మందులు హోమియోపతిలో ఉన్నాయని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ, అధికార శక్తులు అల్లోపతి మందుల తయారీ కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తూ ఈ మందులు వెలుగులోకి రానీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోమియోపతి మందుల పట్ల ప్రజల్లోనే మార్పు రావాలని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.