ఒక తార జీవితం
‘సితార’ అంటే సీనియర్ దర్శకుడు వంశీ తీసిన సినిమా టక్కున గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రానుంది. రవిబాబు, రవనీత్కౌర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జి.ఎల్ సురేంద్ర దర్శకత్వంలో డి.ఎస్ రవికుమార్ నిర్మిస్తున్నారు. ‘‘సురేంద్ర కథ ఎంత బాగా చెప్పాడో, అంతకన్నా బాగా తీస్తున్నారు.
త్వరలో పతాక సన్నివేశాల చిత్రీకరణ ఆరంభిస్తాం. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుభవం ఉన్న దర్శకునిలా సురేంద్ర చాలా బాగా తీస్తున్నారు. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని నటుడు రవిబాబు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి, ఎడిటింగ్: నందమూరి హరి.