GO 107
-
మంత్రి నారాయణను ఇంటర్‌బోర్డు సభ్యునిగా తొలగించాలి
నందలూరు: మంత్రి నారాయణను ఇంటర్‌బోర్డు సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం తక్షణమే తొలగించాలని సమాజసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు. మంత్రి నారాయణ తన విద్యాసంస్థల ద్వారా పేదవిద్యార్థుల నుంచి కోట్లాదిరూపాయలను ఫీజుల రూపంలో దోపిడి చేస్తున్న వ్యక్తి అని అతనిని ఇంటర్‌బోర్డు సభ్యునిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే 107జీవోను రద్దుచేసి మంత్రి నారాయణను ఇంటర్‌బోర్డు సభ్యునిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: జీవో 107ను వెంటన రద్దు చేయాలని జానియర్ డాక్టర్లు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోను నిరసిస్తూ కాలేజీ మెట్లపైనే జూడాలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మొహరించారు. జూడాల సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు తెలిపింది. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.